ఏలూరు ,ఫిబ్రవరి 1: కమీషనర్ వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాలు మేరకు అయోడిన్ శాంపిల్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగముగా ఏలూరు జిల్లాలోని ౩౦ ప్రాధమిక వైద్య కేంద్రాల పరిధిలో స్కూల్స్ ను సందర్శించి అక్కడ పిల్లలకు గాయిటర్ పరీక్ష, అయోడిన్ డెఫిషియన్సీ మరియు నీరుడు పరీక్ష చేయడం జరిగినది.
Publish Date : 01/02/2023

ఇందులో భాగముగా గోపన్నపాలెం PHC, పెదవేగి PHC , గజ్జలవారి చెరువు అర్బన్ హెల్త్ సెంటర్ మరియు వట్లూరు PHCలను తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగముగా స్టేట్ నోడల్ ఆఫీసర్ – Dr. రమేష్ గారు, DM&HO – Dr. ఎం. నాగేశ్వర రావు గారు, డిస్ట్రిక్ట్ లెప్రసి, ఎయిడ్స్ & TB ఆఫీసర్ – Dr జి. రత్న కుమారి గారు, NCD ప్రోగ్రాము ఆఫీసర్ – Dr. Ch. మానస గారు, ఎపిడిమోలోజిస్ట్ – Dr. T. దేవి రత్న ప్రియాంక గారు, FLC – Ch. గణేష్ పాల్గొన్నారు.
ఇందులో భాగముగా DM&HO గారు మాట్లాడుతూ అందరు అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలని సూచించడం జరిగినది.