ముగించు

ఆధ్యాత్మిక పర్యాటకం

గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రము, జంగారెడ్డిగూడెం:

గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రము

పూర్వము చిట్టియ్య గారు అనే భక్తునికి శ్రీ వేంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామము ఉత్తరము వైపున గల కొండలలో తన పాదములు వెలుస్తాయని ఆ ప్రదేశములో ఆలయము నిర్మంపమని భక్తుల ఆణిష్టములు నేరవేర్చుదునని భగవంతుడు తెలుపగా ఆ ప్రకారము అన్వేషించగా జంగారెడ్డిగూడెం ఉత్తర వైపున వరుసగా గల 7 కొండలలో 6వ కొండపై స్వతః సుద్దంగా పెరుగుచున్న పారిజాత వృక్షము క్రింద స్వామివారి పాదములు కల శిల ను గుర్తించి ఆ ప్రదేశములో చిన్న మందిరమును నిర్మంచి శ్రీ వేంకటేశ్వరుని శిల్పమును నెలకొల్పినారు.  భక్తుల కోర్కెలు నెరవేర్చుచూ స్వామి అనతికాలంలో ప్రసిద్ధినొందినాడు.  2003 సంవత్సరంలో శ్రీ పేరిచర్ల జగపతిరాజు గారి ఆధ్వర్యములో అభివృద్ధి కమిటి ఏర్పాడి భక్తుల సహకారంతో ప్రస్తుత, అమ్దమైన ఆలయము నిర్మించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి పర్యవేక్షణలో శ్రీవైఖానస ఆగమయుక్తంగా స్వామి వారి పాదాలు వెలసిన ప్రదేశములో ప్రస్తుత విగ్రహము ప్రతిష్టించినారు, పాడి పంటలు కలిగిన ప్రదేశము కావున గోకుల మని పారిజాత వృక్షములు కల కొండ కావున పారిజాతగిరి అని వేంకటేశ్వరుడు గల క్షేత్రము కావున తిరుమల అని గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రముగా ప్రసిద్ధి పొందినది.

 

శ్రీ భూనీళా సమేత శ్రీ జనార్ధనస్వామి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం, ఏలూరు:

కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం

ఈ సృష్టికి మూలమైన జగన్మాత త్రిమూర్తులను సృష్టి౦చి తనను పరిణయమాడవలెనని కోరగా, అందుకు బ్రహ్మ, విష్ణువులు అంగీకరించకపోవుటచే శంకరున్ని కోరగా మూడవనేత్రమును, తనశక్తులను తన వశము చేసినచో అందుకు అంగీకరించెదనని తెలిపెను.  ఆ మాటలకు జగన్మాత అంగీకరించి తన శక్తులతో పాటు మూడవనేత్రమును శంకరుని వశము చేసినంతనే శంకరుడు జగన్మాతను భస్మము చేసేనట. అంతట ఆ భస్మమును నాలుగు భాగములు చేసి మూడు భాగములను, లక్ష్మీదేవి, పార్వతిగా తాను పొందిన శక్తీ ప్రభావముచే సృష్టి౦చెను.  మిగిలిన నాల్గవ భాగమును మరలా 101 భాగములుగా చేసి వాటికి ప్రాణం పోసి లోకరక్షణకై ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క దేవత గ్రామరక్షణ గావించవలెనని ఆదేశించెనట.  అలా పరమశివుడు ఆదేశించిన దేవతలే నేడు గ్రామదేవతలుగా ప్రతీ గ్రామంలోనూ వెలిసినారట.  అలా వెలిసిన వారే నూకాలమ్మ, పోలేరమ్మ, సత్తెమ్మ, మహావిష్ణువు వీరందరికీ తముడుగా పోతురాజు అనే నామ౦తో ఉద్భవి౦చెనట.

అప్పటి నురిడియూ ఒక్కోక్క  ప్రాంతానికి ఒక్కోక్క  గ్రామదేవత వెలసి గ్రామసరిరక్షణార్ధమై గ్రామ పొలిమేరల్లో ఉ౦టూ గ్రామాన్ని దుష్టశక్తుల బారి నుంచి కాపాడి రక్షిసున్నారట. ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ద అమావాస్య వరకూ ప్రతీరోజూ రాత్రి గ్రామ సంరక్షణార్ధమై ఈ దేవతలు తనకు “ప్రతిరూపమైన గరగలుగా వెళ్ళి ఎక్కేగుమ్మం దిగేగుమ్మంగా వెళ్తూ ఏమైనా దెయ్యాలు- భూతాలు కనిపిరిచినచో తమ తముడైన పోతురాజుకు అప్పగి౦చి వస్తారట. తన అక్క తనకు అప్పచెప్పిన దుషశక్తులను పోతురాజు బారికోడు (మాదిగవాడు) కి అష్పగి౦చి వస్తాడట. అలా అప్పగి౦చిన దూతలను బారికోడు మరల గ్రామ పొలిమేరకు తీసుకెళ్ళి దిగదుడుపులను వదిలి వస్తు౦టాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచార౦గా ఈనాడు పల్లెయ౦దు పట్టణాలయ౦దు కూడా పూర్వపు సంప్రదాయబద్దంగా ఆచరిస్తూ వస్తున్నారు.

ద్వారకా తిరుమల:
ద్వారకా తిరుమల

ఈ తీర్థయాత్ర కేంద్రం గొప్ప సెయింట్ అయిన “ద్వారకా తిరుమల” అని పిలువబడుతుంది, “వల్మరికం” (చీమల కొండ) లో తీవ్ర తపస్సు తరువాత లార్డ్ “శ్రీ వెంకటేశ్వర” యొక్క విశిష్టమైన విగ్రహం ఉన్న “ద్వార్క”. భక్తులు శ్రీ వెంకటేశ్వరని కలియుగ వైకుంట వసా అని పిలుస్తారు. ఈ ప్రదేశంను “చిన్నా తిరుపతి” అని కూడా పిలుస్తారు. గంజూ మరియు యమునా వంటి నృత్యాలు ఉత్తర భారతదేశ నదులు, అవి మూలం వరకు వెళ్ళేటప్పటికి, ఇంకా కృష్ణా, గోదావరి వంటి దక్షిణ భారత నదులు మరింత పవిత్రంగా ఉన్నాయి. . అందువల్ల చాలా దేవాలయాలు మరియు పవిత్ర స్నాన ఘాట్లు, దగ్గరి విరామాలలో, గొప్ప గ్రాండ్ నదులు కృష్ణ మరియు గోదావరి రెండు వైపులా వారి దిగువ ప్రాంతాల్లో ఉన్నాయి. మన ద్వారకా తిరుమల చేత ఉన్న ప్రాంతం భారతదేశంలో అత్యున్నత స్థానానికి కట్టుబడి ఉంది, ఈ రెండు గొప్ప భారతీయ నదులు కృష్ణ మరియు గోదావరిచే బ్రహ్మాంతరంగా బ్రహ్మ పురాణం సూచించాయి. తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుడికి వారి విరాళాలు లేదా టోన్లులు లేదా ఏ ఇతర అర్పణలు ఇవ్వాలని కోరుకునే భక్తులు, “పెద తిరుపతి” అని పిలవబడతారు, ఎందుకంటే వారు అక్కడ వెళ్ళలేక పోతే, ద్వారకా తిరుమల ఆలయంలో వారి విరాళాలు, ప్రార్థనలు మరియు ఆరాధనలను అందిస్తాయి.

 

ఆంజనేయస్వామి దేవస్థానం,జంగారెడ్డిగూడెం :

ఆంజనేయస్వామి దేవస్థానం

ఆంజనేయస్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడలేని ధైర్యమూ వస్తుందికదా.  భయం వేసే సమయంలో ఆయనని తలుచుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు.  ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆయన ఆరాధ్య దైవము.  భక్తులకీ భగవంతునికీ అవినాభావ సంబంధం వుంటుంది.  కొందరు భక్తులు భగవంతునికి సేవచేసి తరిస్తే, భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు.   ఆ రెండో కోవకి చెందిన భగవంతుడు, భక్తుడు, వారు వెలసిన క్షేత్రంగురించి ఈ వారం తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం ఊళ్ళో వున్నది ఈ ఆంజనేయస్వామి ఆలయం.  ప్రతి నిత్యం భక్త జన సమూహాలతో కళ కళలాడే ఈ సుప్రసిధ్ధ క్షేత్రం ఎఱ్ఱకాలవ ఒడ్డున వున్నది.  తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుడై వెలసిన స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామాయణములలో చెప్పబడింది.  ఆ కధేమిటంటే త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు వుండేవాడు. ఆయన  జన్మతో రాక్షసుడైనా రాక్షస ప్రవృత్తిలేక ఆధ్యాత్మకి చింతనతో వుండేవాడుట.  రామ రావణ యుధ్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుణ్ణి చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా, హనుమా అంటూ తనువు చాలించాడు. తర్వాత ద్వాపరయుగంలో మధ్వికుడుగా జన్మించాడు.  అప్పుడుకూడా సదాచార సంపన్నుడై, సద్భక్తితో జీవితం గడిపేవాడు.  ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుధ్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ, అర్జనుని జెండాపైన వున్న పవనసుతుని చూసి, పూర్వజన్మ స్మృతితో ప్రాణ త్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు.  ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవటానికి నివాసం ఏర్పరచుకున్నాడు.  ప్రతి నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు.  వయోభారం మీదపడ్డా మధ్వ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్ర కాలువ స్నానం, ఆంజనేయస్వామి గురించి తపస్సు విడువలేదు.