Close

చింతలవల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి…

Publish Date : 10/09/2024

నూజివీడు/ముసునూరు/ఏలూరు,సెప్టెంబరు,10: మసునూరు మండలం చింతలవల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను మంగళవారం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆకస్మిక తనిఖీ చేసారు. గురుకుల పాఠశాలలోని పారిశుధ్యం, వంటగది, టాయిలెట్స్ తదితరాలను ఆయన పరిశీలించారు. హాస్టల్ ల్లోని సమస్యలను విద్యార్ధుల నుండి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ కు వెళ్లే మట్టిరోడ్డును సిసి రోడ్డుగా నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. డైనింగ్ హాలు మరమ్మత్తుల కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. అక్కడ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లింపు జరిగేలా చూడాలని సంబంధిత సిబ్బంది మంతివర్యుల దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయన స్పందిస్తూ సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వెంటనే జీతాల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంత్రివెంట తహశీల్దారు రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ కె. ప్రవీణ తదితరులు ఉన్నారు.