ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ‘శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం’ ప్రారంభం
ఏలూరు, జనవరి, 4 : ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ‘శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం’ ప్రారంభం అనంతరం ప్రతీ విద్యార్థిని, విద్యార్థులను కలిసి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఈసి 2వ సంవత్సరం చదువుతున్న దివ్యాంగుడైన విద్యార్థి సాయి వినోద్ ని కలిసి వారి సమస్యను కలెక్టర్ వెట్రిసెల్వి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో టాయిలెట్లు, క్రీడా సౌకర్యాలు, వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. తమ కళాశాలలో విద్యా బోధనా చక్కగా ఉందని, అధ్యాపకులు తమకు అర్ధమైన రీతిలో బోధిస్తున్నారని, టాయిలెట్లు ఉన్నాయని, కానీ వాటిలో కొన్ని మరమ్మత్తులు చేయించాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి సాయి వినోద్ తీసుకువచ్చారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబును కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థినులతో కలిసి సామాన్య విద్యార్థినిలా మధ్యాహ్న భోజన క్యూ లైన్ లో నిలుచుని భోజనం చేశారు.