Close

ఏలూరులో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 30/08/2026

ఏలూరు, ఆగష్టు, 30 ; ఏలూరులోని సిద్ధార్థ ట్రస్ట్ పాఠశాలలో జరిగిన నీట్ పిజి ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందనన్నారు. భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య సీట్ల కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష అని, ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరులోని సర్.సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మరియు సిద్దార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్ నిర్వహించడం జరిగిందన్నారు. ,పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సర్.సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 214 మంది విద్యార్థులకు గాను 213 మంది విద్యార్థులు మరియు సిద్దార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్ లో 175 మంది విద్యార్థులకు గాను 164 విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తంగా జిల్లాలో నీట్ పిజి ప్రవేశ పరీక్షకు 389 మంది విద్యార్థులకు గాను 377 మంది విద్యార్థులు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకున్నదని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు.

ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఏలూరు, పెదపాడు తహసీల్దార్లు ఎస్. వి. రవీంద్రనాధ్, ఏ.కృష్ణజ్యోతి, ప్రభృతులు పాల్గొన్నారు.