Close

కొల్లేరు సరస్సుకు సంబంధించి 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తయిన పిదప గ్రౌండ్ ట్రూతింగ్ కు కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై శనివారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ కె .వెట్రిసెల్వి సమీక్షించారు.

Publish Date : 28/12/2024

ఏలూరు, డిసెంబర్,28:కొల్లేరు సరస్సుకు సంబంధించి 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తయిన పిదప గ్రౌండ్ ట్రూతింగ్ కు కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై శనివారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ కె .వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా కొల్లేరు సరస్సు లిడార్ ల్యాండ్ సర్వే నిర్వహించిన ఏజెన్సీ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, అటవీ శాఖ అధికారులు ,ఇరిగేషన్, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే చేపట్టేందుకు ఉన్న అవసరత, సాంకేతిక సామర్థ్యాలు తదితర అంశాలు శాస్త్రీయ బద్దంగా ఉండేలాగా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశం అనంతరం గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే కు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి .దాత్రి రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారి ఆశా కిరణ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పి విజయ, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరిష్, డ్రైనేజీ ఈఈ సిహెచ్ . సత్యనారాయణ, సర్వే ఏడి అన్సారి , డివిజనల్ సర్వే అధికారి తదితరులు పాల్గొన్నారు.