Close

గురువారం స్ధానిక ఐటీడీఏ, కె.ఆర్.పురం కార్యాలయంలో ట్రైకార్ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, పోలవరం శాసనసభ్యులు, చిర్రి బాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్ చార్జీ ఐటిడిఏ పివో పి. ధాత్రి రెడ్డి పాల్గొన్నారు.

Publish Date : 02/01/2025

ఏలూరు/బుట్టాయిగూడెం,జనవరి, 2: గిరిజన సంక్షేమానికి ఉద్ధేశించబడిన ట్రైకర్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అధికారులను కోరారు. గురువారం స్ధానిక ఐటీడీఏ, కె.ఆర్.పురం కార్యాలయంలో ట్రైకార్ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, పోలవరం శాసనసభ్యులు, చిర్రి బాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్ చార్జీ ఐటిడిఏ పివో పి. ధాత్రి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా గిరిజన ప్రాంతాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ట్రైకర్ కార్యక్రమాలను మరింత విస్త్రృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జెసి పి. ధాత్రిరెడ్డి పేర్కొన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు వలసలు పోకుండా స్వయం ఉపాధిపొందేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఐటిడిఏ ఎపివో పివిఎస్ నాయుడు, పలువురు సెక్టార్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఏజెన్సీ మండలాలలోని మండల స్పెషల్ ఆఫీసర్, తాహశీల్దార్లు, యంపిడివోలతో పిసా ఎన్నికల ఏర్పాట్లుపై సమీక్షించారు.