Close

జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 09/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 9 : జవహర్ నవోదయ విద్యాలయాలలో 9 మరియు 11వ తరగతుల్లో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి LEST-2027 కోసం ఆన్‌లైన్ ద్వారా ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో 9 మరియు 11వ తరగతుల్లో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి NVS అఖిల భారత స్థాయి ‘లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్’ (LEST)ను నిర్వహిస్తుందని, దీనికి అనుగుణంగా, 2027-28 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, 9 మరియు 11వ తరగతుల సమర్పించడానికి చివరి తేదీ ఈనెల 31వ తేదీ అని, LEST IX & XI-2027 పరీక్ష 10 ఏప్రిల్ 2027న నిర్వహించబడుతుందన్నారు. ఈ సందర్భంలో, జిల్లావ్యాప్తంగా అర్హులైన, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థుల నుండి LEST IX & XI-2027 కోసం గరిష్ట సంఖ్యలో నమోదులు జరిగేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.