జిల్లాలో వెదురు ‘జాతీయ వెదురు మిషన్’ ద్వారా వెదురు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు, ఆగష్టు, 29 : జిల్లాలో వెదురు ‘జాతీయ వెదురు మిషన్’ ద్వారా వెదురు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ అధికారులకు ‘జాతీయ వెదురు మిషన్’ కింద చేయవలసిన పనులపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ ప్రాంతాలలోని వారికి లబ్ది కలిగేలా వెదురుచే తయారుచేయబడిన వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. వెదురు కోత అనంతరం వాటిని స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ స్థానికులచే వెదురు నుండి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వినియోగానికి వస్తువుల తయారీకి అందించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలు, గిరిజన ప్రాంతాలలోని వారికి శిక్షణ అందించడం జరిగిందని, వెదురు ఉత్పత్తులతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వారి పరిధిలోని వెదురు స్టాక్ పాయింట్లను మాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో అటవీయేతర ప్రాంతాలను గుర్తించి, వాటిలో వెదురు సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వెదురు సాగుకు ప్రభుత్వం అనేక రాయితీలను ఇస్తున్నదని , వాటిని వెదురు సాగుకు ఆసక్తికలిగిన వారికి తెలియజేసి సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కలిగించాలన్నారు.
వెదురు సాగుకు హెక్టారుకు గరిష్ఠంగా రూ.60,000/-సబ్సిడీ రెండు సంవత్సరాల్లో 60:40 నిష్పత్తిలో అందించబడుతుందని,. యూనిట్ కాస్ట్ హెక్టారుకు రూ.1,20,000/-గా నిర్ణయించబడిందన్నారు. . హెక్టారుకు కనీసం 400 మొక్కలు ఉండాలని,. బ్లాక్/బౌండరీ ప్లాంటేషన్‌కు కనీసం హెక్టారుకు 400 మొక్కలు ఉండాలన్నారు. . ఒక్కో మొక్కకు రూ.150/- లేదా హెక్టారుకు గరిష్ఠంగా రూ.60,000/- వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందన్నారు. . ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా 10 హెక్టార్ల వరకు అర్హత ఉంటుందని, హైటెక్ నర్సరీ (2 హెక్టార్లు) – యూనిట్ వ్యయం 60 లక్షలు, పెద్ద నర్సరీ (1 హెక్టార్) – యూనిట్ వ్యయం 20 లక్షలు, చిన్న నర్సరీ (0.5 హెక్టార్) – యూనిట్ వ్యయం 10 లక్షలు, ప్రభుత్వ రంగ నర్సరీ లకు 100% సబ్సిడీ మరియు ప్రైవేటు కు 50% సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు.
వెదురు మొక్కల పెంపకానికి నిర్ణయించిన యూనిట్ వ్యయం పై ప్రభుత్వ రంగానికి 100% సబ్సిడీ అందించబడుతుందని, ప్రభుత్వ పంచాయతి, కమ్యూనిటి మరియు వ్యర్ధ భూములలో వెదురు సాగు ప్రోత్సహించేందుకు హెక్టారుకు 1.20 లక్షలు 2 సంవత్సరములకు, వెదురు డిపోలు, గోడౌన్ల ఏర్పాటుకు ప్రాజెక్ట్ ఆధారంగా ప్రభుత్వ రంగానికి 100%, ప్రైవేటు కు 50% సబ్సిడీ అందించబడుతుందని,
2026-27 ఆర్ధిక సంవత్సరానికి రైతులు / వెదురు సాగు నిమిత్తం దరఖాస్తు (RSK) లో చేసుకున్న యెడల ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అటవీ శాఖ కు 25000 వెదురు మొక్కలు పెంపకం నిమిత్తం మొక్క ఒక్కింటికి రూ.20 చొప్పున రూ.5 లక్షలు మంజూరు చేయడమైనదని చెప్పారు.
సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి పి .వి. సందీప్ రెడ్డి, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, డ్వామా పీడీ కె. వి. సుబ్బారావు, ఎంఐపి పీడీ రామ్మోహన్, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ప్రభృతులు పాల్గొన్నారు.