జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, APCPDCL CMD శ్రీ లోతేటి శివశంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు .
Publish Date : 28/08/2026
ఏలూరు, ఆగష్టు, 28: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం ఒక్కరోజు కార్యక్రమానికి జిల్లాకు వచ్చిన జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, APCPDCL CMD శ్రీ లోతేటి శివశంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు. జిల్లా కలెక్టరుతో పాటు అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్నలు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, ఆర్డీవో లు కె.లక్ష్మీప్రసన్న, యం.వి.రమణ, ఆర్వోలు, ఏఇఆర్వోలు, జిల్లాకు చెందిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు.