జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జెసి పి. ధాత్రిరెడ్డి.
Publish Date : 01/01/2025
ఏలూరు, జనవరి, 1: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా బుధవారం స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో శాంతి భధ్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ను ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా ప్రణాళిక బద్దంగా అధికారులు అంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు.