జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Publish Date : 31/12/2024
ఏలూరు, డిశంబరు, 31: నూతన సంవత్సరం సందర్బంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, పాత్రికేయులకు మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు 2025 సంవత్సరంలో అంతా మంచిజరగాలని, ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో మంచి పంటలు పండి, విద్యా, పారిశ్రామిక పరంగా కూడా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.