టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత.. వెటర్నర్ క్రీడాకారుడు చిట్టెల గంగాధరరావు. గంగాధరరావు ను అభినందించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి.
ఏలూరు, జనవరి, 2: విజయవాడ ఫన్ టైం క్లబ్ ఇండోర్ ఆడిటోరియంలో జరిగిన 9వ ఏపీ స్టేట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో ఏలూరు నివాసి చిట్టెల గంగాధరరావు 70 ప్లస్ పురుషుల విభాగంలో ఛాంపియన్ గెలవడం ద్వారా యువ క్రీడాకారులకు స్ఫూర్తి దాయకంగా నిలిచారని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అభినందించారు.
ఇటీవల విజయవాడ ఫన్ టైం క్లబ్ ఇండోర్ ఆడిటోరియంలో జరిగిన 9వ ఏపీ స్టేట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో వెటరన్ విభాగంలో విజేతగా నిలిచిన గంగాధర రావు జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాశానికి, శారీరక దారుడ్యానికి ఎంతో తోడ్పాటు నిస్తాయన్నారు. నేటి యువత ఆధునిక పోకడలకు, కంప్యూటర్ ఆటలకి పరిమితం అవ్వడం వల్ల శారీరక ఆరోగ్యానికి దూరం అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి వెటరన్ టేబుల్ టెన్నిస్ సింగల్ విభాగంలో 70+ కేటగిరీలో ట్రోఫీ కైవసం చేసుకుని విజేతగా నిలిచిన గంగాధరరావు యువతకు , ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తి దాయకంగా నిలవడం అభినందనీయమని ప్రశంసించారు. నిరంతరం వయస్సును కూడా లెక్క చేయకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగే వెటరన్ విభాగంలో క్రీడల్లో రాణించి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకంగా నిలవడం విశేషం అన్నారు.
ఇటీవలి విజయవాడలో జరిగిన 9 వ రాష్ట్ర స్థాయి వెటరన్ టేబుల్ టెన్నిస్ సింగల్ విభాగంలో 70+ కేటగిరీలో ట్రోఫీ లో పాల్గొనడంతో పాటు డిసెంబర్ 8 న విశాఖపట్నం రైల్వే ఇండోర్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలోను, డిసెంబర్ 1న విశాఖపట్నం నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో వెటరన్ టేబుల్ టెన్నిస్ సింగల్ విభాగంలో పాల్గొని విజేతగా నిలిచి పలువురు ప్రశంసలు అందుకోవడం జరిగిందని వెటరన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు చిట్టెల గంగాధరరావు తెలిపారు.