Close

ముంపు గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి…జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

Publish Date : 25/07/2024

ఏలూరు/వేలేరుపాడు, జూలై, 25…భధ్రాచలం వద్దపెరుగుతున్న గోదావరి నది రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని తద్వారా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వేలేరుపాడు మండలం కరుటూరు గ్రామంలోని ప్రజలను కలిసి గోదావరి నది ప్రమాద హెచ్చరికపై అప్రమత్తంగా ఉండాలని జేసీ చెప్పారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, జిల్లా అధికార యంత్రాంగం అంతా మీకు సేవ చేసేందుకు ఉన్నారని, కావున ప్రజలందరూ వరద సహాయక కేంద్రాలను రావాలని సూచించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేలేరుపాడు తహశీల్దారు కార్యాలయంలో వరదలు ప్రత్యేక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో లోతట్టు గ్రామాల ప్రజలు తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్ధాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. పునరావాస కేంద్రంలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. పశువులకు ఆహరం అందించాలని , పునరావాస కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. సహాయ కేంద్రాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ఏర్పాటు తదితర ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె. అద్దయ్య, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, సివిల్ సప్లైయిస్ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.ఎస్. రాజు, తదితరులు ఉన్నారు.