Close

రైతుల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు

Publish Date : 04/01/2025

ఏలూరు, జనవరి, 4: రైతుల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. శనివారం చాటపర్రు పంచాయితీ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవిన్యూ సదస్సుకు జెసి ధాత్రిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా రెవిన్యూ సదస్సు లో వచ్చిన వినతులను ఆమె స్వీకరించి సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారురను ఆదేశించారు. అనంతరం చాటపర్రు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అలాగే రైతులకు అందించే గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. చినిగిపోయిన వాటికి బదులు కొత్త సంచులు తీసుకోవాలని జెసి తెలిపారు.
కార్యక్రమంలో రెవిన్యూ , సివిల్ సప్లైయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.