విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ రాయితీ.
ఏలూరు, జనవరి, 1: జిల్లాలో శారీరక వైకల్యము కలిగి యుండి స్వంత వ్యాపారము గాని ఏదేని గుర్తింపు కలిగియున్న ప్రైవేటు సంస్థలలో గాని పని చేయుచూ మూడు చక్రాల మోటారు వాహనము కలిగి యున్న విభిన్న ప్రతిభావంతులు పెట్రోలు రాయితీకి దరఖాస్తు చేసుకోన వలసినదిగా కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు దరఖాస్తుదారులు వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు వారి సదరం ధ్రువీకరణ పత్రము, పెట్రోల్ కొనుగోలు చేసిన బిల్లులు, బిపిఎల్ రేషన్ కార్డు, డైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రము, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ (అకౌంట్ నెంబర్ కనపడు విధముగా), ఆధార్ కార్డు, వ్యాపారం లేదా ప్రైవేటు సంస్థలో పని చేయు చున్నట్లు ధ్రువీకరణ పత్రము, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ ప్రాంగణము, ఏలూరు వారికి అందజేయవలసినదిగా కోరారు. జిల్లాలోని అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశము సద్వినియోగ చేసికోవల్సిందిగా ఆయన కోరారు. ఇతర వివరములకు కార్యాలయ టెలిఫోను నెం.08812-234146 నకు కార్యాలయ పనిదినములలో సంప్రదించవచ్చన్నారు.