పాలకుంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.
Publish Date : 02/01/2025
ఏలూరు/బుట్టాయిగూడెం,జనవరి, 2: బుట్టాయిగూడెం మండలంలోని పాలకుంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ ఇన్ చార్జి పివో పి. ధాత్రిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్ధినులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్ధినులకు పుస్తకాలు , పెన్నులు బహుకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధినులు అంతా ఉన్నతస్ధాయికి చేరుకోవాలనే లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నారు. ఈ సందర్బంగా విద్యాప్రమాణాలపై విద్యార్ధినులతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, ఆదిశగా చదువుపై పూర్తిశ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం పాఠశాల వసతిగృహ ఆవరణను పరిశీలించారు.