ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రగతిపై అధికార్లు,సూపర్వైజర్లు, బియల్వో లతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష …
ఏలూరు, ఆగస్టు 27: స్థానిక నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రగతిపై నగర పాలకసంస్థ అధికారులు, సూపర్వైజర్లు, బియల్వో లతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై మ్యాపింగు, అనామలీస్, కరేక్షన్లు, ప్రగతిపై అర్బన్ లో 247 పోలింగు బూత్ లు వారీగా 247 బియల్వో లతో సమీక్షించారు. ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రగతి చాలా పూర్ గా ఉందని జిల్లా కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు హాజరుకాని సూపర్వైజర్లు, బిఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని, ఇదే పరిస్థితి పునరావతమైతే సస్పెండు చేస్తానని జిల్లా కలెక్టరు హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలు ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, ఎన్నికల ప్రక్రియను మనస్సు పెట్టి పనిచేస్తే మంచిఫలితాలు వస్తాయని అన్నారు. పొరపాట్లు, అలసత్వం వహిస్తే సస్పెండు అవుతారని, తీవ్రత బట్టి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని మరియు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని, అనర్హులుగా గుర్తించిన వారి వివరాలను పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించుకుని తాగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతతో, అప్రమత్తంగా, మనస్సు పెట్టి పనిచెయ్యాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్, మాపింగు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, బిఎల్వోలకు సీనియరు సూపర్వైజర్లతో మరొకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా ఎస్ఐఆర్, ప్రోగ్రామ్, అనామలీస్ లోపాలు, వ్యత్యాసాలు, మరియు మాపింగు ప్రక్రియపై సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని అన్నారు. నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం ఎస్ఐఆర్ పనులను వేగవంతం చెయ్యాలని అన్నారు. అనామలీస్ గుర్తింపు, ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలు మరియు లోపాలు, మాపింగు పనులు, పోలింగు కేంద్రాలు మరియు ఓటర్ల మాపింగు ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచెయ్యాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ ఎన్నికలు నేపథ్యంలో కమీషనర్లు తమ పరిధిలో అనుభవజ్ఞులైన, సమర్థులైన అధికారులను గుర్తించి ఎన్నికల విధులకు నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాల్లో శాఖలు మధ్య సమన్వయం ఉండాలని, రాష్ట్ర ఎన్నికలు సంఘానికి నిర్ణీత గడువులో అవసరమైన వివరాలతో అనుసరణ నివేదిక సమర్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనరు ఏ.భానుప్రతాప్, అడిషనల్ కమీషనరు డి.శ్రీనివాస రావు, అసిస్టెంటు సిటీ ప్లానరు బాబూరావు, తహశీల్దారు యస్.వి. రవీంద్రనాథ్, సూపర్వైజర్లు, బిఎల్వోలు, నగరపాలక సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.