ఏలూరు, ఆగష్టు, 25 : గోదావరి పుష్కరాలు -2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులు , పుష్కరాల ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్సులతో కలిసి మంగళవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీ

Publish Date : 25/08/2026

ఏలూరు, ఆగష్టు, 25 : గోదావరి పుష్కరాలు -2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులు , పుష్కరాల ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్సులతో కలిసి మంగళవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. . గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల ఏర్పాట్లు, ఘాట్లలో మౌలిక సదుపాయాలు, ఆయా ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత, తదితర ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని, మంజూరైన పనులను త్వరితగతిన, నాణ్యత ప్రమాణాలతో చేపట్టి పూర్తిచేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

ఏలూరు జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రానున్న గోదావరి మహా పుష్కరాలకు ఏలూరు జల్లాలో 414 కోట్ల రూపాయలతో 388 పనులకు ప్రతిపాదించామని, 28 ఘాట్లను ఏర్పాటుచేస్తున్నామని సీఎం కు తెలిపారు.