Close

అక్షర ఆంధ్రలో అభ్యాసకులు పరీక్షల్లో నూటికినూరు శాతం విజయంసాధించి, ఏపీలో మొదటి స్థానంలో నిలిచేలా సమిష్టి కృషి చెయ్యాలి.

Publish Date : 23/02/2026

ఏలూరు, ఫిబ్రవరి 23: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అక్షర ఆంధ్ర కార్యక్రమం వయోజన అభ్యాసకులకు 28వ తేదీన ఫ్రీ ఫైనల్ పరీక్షలు, 29వ తేదీన ఫైనల్ పరీక్షలకు తగిన ఏర్పాట్లుపై జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వయోజన అభ్యాసకులకు 28వ తేదీ ఫ్రీ ఫైనల్ పరీక్షలు, 29వ తేదీన ఫైనల్ పరీక్షలకు 97,200 మంది వయోజన విద్యా అభ్యాసకులు హాజరు అవుతున్నారని, సుమారు 3,350 సెంటర్లు ఏర్పాట్లు చేసామన్నారు. ఫ్రీ ఫైనల్ పరీక్షలు, ఫైనల్ పరీక్షలు వేరువేరుగా ఒక్కొక్క రోజునే జరిగే ఈ పరీక్షలకు అని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అక్షర ఆంధ్ర అభ్యాసకులు నూటికినూరు శాతం హాజరు అయ్యి అందరూ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానం నిలిచేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు.

ఈ సమావేశానికి జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు జి.సి.హెచ్.ప్రభాకర్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిఆర్డీఏ పిడి టి.వి.విజయలక్ష్మి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.