ఆకట్టుకున్న అంజూ గీసిన చిత్రం జిల్లా కలెక్టర్ చిత్రపటాన్ని గీసిన అంజూ అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు కృషికి పలువురు ప్రశంసలు

ఏలూరు,మార్చి 10:ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము నైపుణ్యము మరియు వృత్తి శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా కలక్టర్ వారి చేయూతతో జిల్లాలోని విద్యావంతులైన విభిన్న ప్రతిభావంతులు అనగా 10వ తరగతి/ ఇంటర్ ఉత్తీర్ణులైన దివ్యాంగులకు ఉద్యోగ అవకాశములు కల్పించేందుకు జనవరి 29న ఏలూరు లోని వై టి సి నందు జాబ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంలో కుమారి బత్తుల అంజు, అంధ దివ్యాంగురాలు సదరు జాబ్ మేళా లో ఉద్యోగం పొందడం జరిగింది. అందుకు ప్రత్యేక కృతజ్ఞతగా జిల్లా కలక్టర్ కె.వెట్రిసెల్వి వారు జిల్లా కలక్టర్ గా జిల్లాకు వచ్చినప్పటి నుండి దివ్యాంగుల పట్ల చూపించే ఆదర అభిమానములను పురస్కరించుకుని,జిల్లా కలక్టర్ గారి జీవిత చరిత్రను పుస్తకీకరించి జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా సోమవారం కలెక్టరేట్ లో ఆవిష్కరింపచేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలక్టర్ వారి చిత్ర పటాన్ని పెన్సిల్ ద్వారా గీయబడిన చిత్రమును కలెక్టర్ వెట్రిసెల్వి వారికి అందజేశారు.
చిత్ర పటాన్ని చూసిన కలెక్టర్ వెట్రి సెల్వి ఎంతో ముచ్చటపడి,కుమారి బత్తుల అంజు, అంధ దివ్యాంగురాలు అయిఉండి, ఆమె లోని నైపుణం ,కృషికి అభినందనలు , కృతజ్ఞతలు తెలిపారు.వారితో పాటు ఆ చిత్రపటానికి చూసిన పలువురు కూడా బత్తుల అంజు ను ప్రత్యేకంగా అభినందించారు.