Close

ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

Publish Date : 23/02/2026

ఏలూరు, ఫిబ్రవరి 23: స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల సోమవారం ఇంటర్ మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్షలు నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాలు భద్రత, సీసీ కెమెరాలు పర్యవేక్షణ, హాల్ టికెట్ల పరిశీలన, పరీక్షా కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు, వైద్యశిబిరం వంటి అంశాలను జిల్లా కలెక్టరు సమగ్రంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 56 ఇంటర్ మీడియట్ పరీక్షా కేంద్రాలు 34,615 విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు వ్రాయుచున్నారని తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమున ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం, బయోమెట్రిక్ హాజరు నమోదు వంటి చర్యలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా పరిశీలించామని తెలిపారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎక్కడా మాస్ కాఫీయింగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. అధికారులకు సూచనలు జారీ చేసి, సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టరు తెలిపారు.

జిల్లా కలెక్టరు వెంట ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐవో) కూరపాటి యోహాన్, తహశీల్దారు కె.గాయత్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.