Close

ఇసుక రవాణ చేసే వాహనాలను ఆన్ లైన్ ద్వారా తక్షణమే రిజిష్టర్ చేసుకోవాలి కొత్త మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా గ్రామ/వార్డ్ సచివాలయాలు, వ్యక్తిగతంగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పారదర్శకంగా ఇసుకు సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి…

Publish Date : 17/09/2024

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక రవాణా చేసే వాహనాలను ఆన్ లైన్ ద్వారా బుధవారం సాయంత్రం నాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇసుక ఆన్లైన్ దరఖాస్తు విధానంపై సమన్వయ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్గదర్శకాల మేరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు, పంపిణీ విధానం ఉంటుందన్నారు. ప్రజలు ఉచిత ఇసుక కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పూర్తి పారదర్శకత, జవాబుదారీ తనంతో ఉచిత ఇసుక పంపిణీ జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా లారీ యాజమాన్యాలు తమ వాహనాలను రిజిష్టర్ చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇసుక రవాణా కోసం వాహనాల రిజిస్ట్రేషన్ కూడా బుధవారం సాయంత్రం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అక్రమ ఇసుక రవాణాకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక పంపిణీ విధానం అమల్లో దరఖాస్తుదరుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసిన ఉంటుందన్నారు. గ్రామ/వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని లేదా వ్యక్తిగతంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. . జిల్లాలో ఉచిత ఇసుక విధానం పై ఇప్పటికే ఎంపిడిఓ లకు శిక్షణ అందించడం జరిగిందని, వారి ద్వారా గ్రామ/వార్డ్ సచివాలయ, ఇతర శాఖల సిబ్బందికి నూతన విధానంపై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఆర్డీఓ ఎన్. ఎస్. కె. ఖాజావలి,మైనింగ్ డిడి రవికుమార్, ఉప రవాణా కమీషనరు ఎస్. శాంతకుమారి, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, ఆర్టిఓ శ్రీహరి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.