ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేసీ పి . ధాత్రిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు…. ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డు పంపిణీ చేశారు….

ఏలూరు, సెప్టెంబర్, 1 : డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) సోమవారం స్థానిక 27వ డివిజన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతీ నెల 1 వ తేదీ నుంచి 5 వ తేదీ లోపు రేషన్ పంపిణీ జరుగుతుందని, అప్పుడు తీసుకోకపోతే సచివాలయం సిబ్బంది ఇంటికి వచ్చి రేషన్ పంపించేస్తారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డుకు ఏ సమయంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాల పూర్తయిన రోజున రేషన్ కార్డు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి, ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఏం సి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఎమ్మార్వో గాయత్రి, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర ప్రముఖులు చోడే వెంకటరత్నం, చైర్మన్ పూజారి నిరంజన్, ఆర్నెపల్లి తిరుపతిరావు, టిడిపి నాయకులు బొ ద్దాని శ్రీనివాస్, ఎడ్లపల్లి శివ, ప్రభృతులు పాల్గొన్నారు.