ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలపై అవగాహన కలిగించాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, ఆగష్టు, 26 : కిషోర వికాసం కార్యక్రమంలో కౌమార దశలో ఉన్న బాల, బాలికలకు వారి హక్కులు, భద్రతలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమంలో తీసుకోవలసిన అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆడపిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిశోరి వికాసం పునః ప్రారంభ కార్యక్రమం పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమం యుక్తవయస్సులో ఉన్న బాలికల సమగ్ర అభివృద్ధికి మరియు ఆర్థిక స్వావలంబన చేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమమన్నారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో వరకట్న మరణాలు , చైల్డ్ మ్యారేజ్, బాల కార్మికులు, గృహ హింస వంటి సంఘటనలు నివారించేందుకు వాటిని ఎదుర్కునే విధంగా చైతన్యవంతులుగా చేసేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలో డ్రాప్ ఔట్స్ లేకుండా విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, వారికి అభిరుచి ఉన్న రంగంలో శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వారి కాళ్లపై వారు నిలబడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ వారం పాఠశాల, కళాశాలల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలోని పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద మాట్లాడుతూ జిల్లాలో 11 నుండి 14 ఏళ్ల మధ్య వయస్సు గల కిశోర బాలికలు 34 వేల 95 మంది ఉన్నారని, వీరిని 5300 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు 41 వేల 600 మంది ఉన్నారని, వీరిని 2535 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరికి
కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్ . సూర్యచంద్రరావు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి , సమగ్రశిక్ష ఏపిడి పంకజ్ కుమార్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పి డీ శారద, సిడిపిఓ తులసి, బాలల సంక్షేమాధికారి సూర్యచక్రవేణి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.