• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఉపాధిహామీ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం అందించే రాయితీ, ఆర్ధిక ప్రోత్సాహం పై ప్రచురించిన రైతు ఫీల్డ్ బుక్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 02/10/2024

ఏలూరు, అక్టోబరు, 2: మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా జిల్లా నీటి యాజమాన్య సంస్ధ ప్రచురించిన ఉధ్యానవన పంటల పెంపకం-2024-25 ఆర్ధిక సంవత్సరంలో సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం అందించే రాయితీ, ఆర్ధిక ప్రోత్సాహంపై ప్రచురించిన రైతు ఫీల్డ్ బుక్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉధ్యాన పంటలకు ప్రభుత్వం అందించు ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటకు ఉపాధిహామీ పధకం ద్వారా మొత్తం మూడు సంవత్సరాలకు కలిపి రూ. 55,770 లు ఉధ్యానశాఖ ద్వారా 60 మొక్కలకు సంబంధించి ఎరువులు, మొక్కలకు కలిపి మెటీరియల్ సబ్సిడీ ద్వారా రూ. 28,860 లు చెల్లించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో డ్వామా పిడి అరవపల్లి రాము, , జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిపివో శ్రీనివాస్ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.