• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు సిబ్బందికి కౌంటింగ్ పై సమగ్ర శిక్షణ

Publish Date : 02/03/2025

ఏలూరు,మార్చి2: తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏలూరు సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్ తెలిపారు.

ఆదివారం సాయంత్రం కౌంటింగ్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కౌంటింగ్ లో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కలెక్టరేట్లో మొదటి విడత శిక్షణ అందించగా ,పూర్తి అవగాహన కలిగించేందుకు రెండో విడతగా కౌంటింగ్ హాల్లో ప్రాక్టికల్ గా శిక్షణ అందించామన్నారు. ఈ నెల 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి2,18,902 ఓట్లు పోలయాన్నారు. ఈ ఓట్ల లెక్కింపు 2,3 రోజులు సమయం పట్టవచ్చు అన్నారు. అందుకు గాను ఓట్ల లెక్కింపు కోసం మూడు షిఫ్ట్ ల్లో 700 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.సుమారు 17 రౌండ్ల లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు.పూర్తి భద్రత ఏర్పాట్లు మధ్య కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు అందించామని, అదేవిధంగా ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబడదన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ లు అనుమతించబడవని, బయటే ఉంచుకోవాల్సి వస్తుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహించబడుతుందన్నారు..

తొలుత కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. సోమవారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు చేయవలసిన అన్ని ఏర్పాట్లపై మరో మారు సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్య వరకు విద్యుత్ సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్ ఈ సాల్మాన్ రాజు ను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యచంద్ర రావు,డి ఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు,ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్,డి ఎస్ పి శ్రావణ కుమార్,జడ్పీ సీఈవో కె.సుబ్బారావు,డి ఆర్ డి ఎ పిడి అర్.విజయరాజు,సివిల్ సప్లైస్ డియం శ్రీలక్ష్మి,ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మాన్ రాజు తదితరులు ఉన్నారు.