Close

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ

Publish Date : 19/03/2026

ఏలూరు, మార్చి , 19 ::- శ్రీ పరాభవ నామ సంవత్సర “ఉగాది” వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు లోని గిరిజన భవన్ లో ఘనంగా నిర్వహించింది. . కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఐ టి డి ఏ పిఓ రాములు నాయక్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అతిధులు సంప్రదాయ వస్త్రాలైన తెల్ల చొక్కా, పంచెకట్టు, కండువాలు ధరించి హాజరై కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.

అనంతరం గిరిజన భవన్ లో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలను ప్రారంభించారు.

తదనంతరం నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

అనంతరం వేదాంతం విష్ణుప్రసాద్ శ్రవణానందంగా పంచాంగ శ్రవణం వినిపించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలన్నారు. జిల్లాలో చక్కని వర్షాలు కురిసి, రైతులకు అధిక దిగుబడులు వచ్చి సంతోషంగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నూరుశాతం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. “శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సరం అంతా ప్రజలందరికీ మంచి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో చాలామంది అధికారులు ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది వంటి పండుగలు నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవడమన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ “శ్రీ పరాభవ నామ సంవత్సర “ఉగాది” సంవత్సరం అంతా ప్రజలకు శుభాలు అందించాలని ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ లను వేద పండితులు వేదఆశీర్వచనాలు అందించారు.
అనంతరం పంచాంగ శ్రవణం చేసిన శ్రీ వేదాంతం విష్ణు ప్రసాద్, వేదపండితులు పి . దుర్గాప్రసాద్, అగ్నిగోత్రం సీతారామాచార్యులు, కోసూరి హరి నరసింహాచార్యులు , ఎం . ఉమాకుమార్, సాంస్కృతిక విభాగంలో పి .సూర్యప్రకాష్, సేవల విభాగంలో కె. శ్రీనివాసు లను జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ లు దుశ్శాలువా, మెమెంటో, నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో సెట్వెల్ సీఈవో ప్రభాకర్, ఉద్యాన శాఖ డిడి సాజా నాయక్, ఎం ఐ పి పీడీ ఎస్ రామ్మోహన్. సమాచార శాఖ డిప్యూటీ ఇంజనీర్ యూ. సురేంద్రనాథ్, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి, బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి నాగరాణి, దేవాదాయ శాఖ అధికారి కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.