Close

కైకలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కు తెలిపారు.

Publish Date : 20/03/2026

ఏలూరు, మార్చి , 17 : కైకలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కు తెలిపారు. జిల్లాలో 22 ఏ భూ సమస్యల పరిష్కారాలపై మంగళవారం భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో 22 ఏ భూ సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్ల వారీగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సమయంలో కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ఏలూరు జిల్లాలో చేరిందన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో 22 ఏ భూ సమస్యలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సిఎస్ కి తెలియజేసారు.
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.