• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

గృహనిర్మాణ ఇంజనీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 24/05/2025

ఏలూరు,మే,24: గృహ నిర్మాణాల బిల్లులు మంజూరులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని, ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చిన యెడల సదరు ఉద్యోగులను విధుల నుండి తొలగించేందుకు వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్ నుంచి శనివారం గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటిస్ తో గృహ నిర్మాణ ప్రగతి పై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ వారంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి పై ఆమె సమీక్షించారు. జిల్లాలో నూజివీడు డివిజన్ లోని మండలాల ప్రగతి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహనిర్మాణ విషయంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను మూడవ స్థానం నుండి రెండవ స్థానంకు తీసుకురావడానికి మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. వచ్చేవారంలో 466 గృహాలను పూర్తిచేయాలని నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లు, సహాయక ఇంజనీర్లు విసృతంగా క్షేత్ర స్ధాయిలో సందర్శించి లబ్దిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.
టెలీకాన్ఫరెన్స్ లో గృహ నిర్మాణ సంస్ధ జిల్లా అధికారి జి. సత్యనారాయణ, ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.