Close

జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సుమారు 70 ట్రాక్టర్లు ర్యాలీలో స్వయంగా ట్రాక్టరు నడిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అదే ట్రాక్టరుపై కూర్చుని రైతులకు, ప్రజ

Publish Date : 01/10/2025

ఏలూరు/ ఆగిరిపల్లి, అక్టోబరు 01: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం – బుడ్డగూడెం కాలనీ నుండి బుధవారం జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సుమారు 70 ట్రాక్టర్లు ర్యాలీ ప్రారంభించి, స్వయంగా ట్రాక్టరు నడిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అదే ట్రాక్టరుపై కూర్చుని రైతులకు, ప్రజలకు అవగాహన, స్ఫూర్తిని కలిగించారు. ఈ ర్యాలీ గ్రామ సచివాలయం వరకు చేరింది. అనంతరం సచివాలయం వద్ద జిఎస్టి తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై ట్రాక్టర్లు, వ్యవసాయ వివిధ రకాలు పరికరాలు, ఫోటో ఎగ్జిబిషన్ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించి, రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీని, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. గత నెల సెప్టెంబరు 22 నుండి కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చాయని, భారత ప్రధాని ఆగస్టు15వ తేదీన ఎర్రకోట నుండి జీఎస్టీ ఫలాలను ప్రకటించడం జరిగిందన్నారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతుందని అన్నారు. అప్పటికి తలసరి ఆదాయం రూ 52 లక్షలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈదిశగా ప్రణాళికలు, ప్రజా పాలన చేస్తున్నారని అన్నారు. అప్పుడు చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది హేళన చేశారని, ఇదే స్ఫూర్తి గొప్ప మలుపు తిప్పబోతుందని అన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలియచెప్పేందుకు దసరా నుండి దీపావళి వరకు జీఎస్టీ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నెల రోజులు చేపట్టడం జరుగుతుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు రైతాంగానికి భారీ ప్రయోగాన్ని చేకూర్చేందుకు ఆలోచన చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా అమలు చేసేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై 18 శాతం, 12 శాతం స్లాబులను సవరిస్తూ ఒకే ఒక్క స్లాబ్ గా ఐదు శాతం జీఎస్టీ కి తగ్గించడం జరిగింది అన్నారు. కొన్నింటికి జీరో శాతం జీఎస్టీ కి పరిమితం చేయడం శుభపరిణామం అన్నారు. దేశం, రాష్ట్రం ప్రయోజనాలు కోసం నిరంతరం ఆలోచన చేస్తూ, మంచి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలను ఆదరించి, ఆశీస్సులు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ తో రైతులు, ప్రజలు కొనుగోలు చేసిన వస్తువుల్లో ధరలు తగ్గి కుటుంబానికి మరికొంత ఆదాయం పెరుగుతుందని అన్నారు. జిఎస్టి ద్వారా రేట్లు ఏ మేరకు తగ్గాయో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, 30 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతులు ప్రజలు మరింత అవగాహన పెంపొందించుకుని జీఎస్టీ ఫలాలు అందుకోవాలని సూచించారు. ఇకనుండి కొనబోయే వస్తువులను, గతంలో కొన్న వస్తువులను బేరీజు వేసుకుంటే మనకు ఎంత ఆదా అయిందో అర్థం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ప్రజలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 3 వేల నుండి 10 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని ఇది శుభపరిణామం అన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ జెడి షేక్ హబీబ్ భాషా, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, యంపిడివో బి.భార్గవి, డిప్యూటీ తహశీల్దారు జి.పవన్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.