Close

జిల్లాలోని రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈనెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వర్చువల్‌గా శంఖుస్థాపన, ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ను వర్చువల్‌గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

Publish Date : 09/11/2025

ఏలూరు, నవంబర్, 9 : జిల్లాలోని రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈనెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వర్చువల్‌గా శంఖుస్థాపన, ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ను వర్చువల్‌గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈనెల 11వ తేదీన కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 60 పారిశ్రామిక ప్రాజెక్టులు మరియు 51 ఎంఎస్‌ఎంఈ లు ప్రారంభోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 208 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ను, నూజివీడు మండలంలో 110 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న ⁠రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్, లను ముఖ్యమంత్రివర్యులు వర్చువల్‌గా శంఖుస్థాపన చేస్తారన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 20 ఎకరాలలో ఏర్పాటుచేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్ ను కూడా ముఖ్యమంత్రివర్యులు వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. గోద్రేజ్ ద్వారకాతిరుమల మండలంలో ఆగ్రోవెట్ లిమిటెడ్ వారు ఏర్పాటుచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 366 మందికి, నూజివీడు మండలంలో ⁠రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు ద్వారా 1500 మంది యువత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు.