Close

జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ ని ఆదేశించారు.

Publish Date : 01/10/2025

ఏలూరు, అక్టోబర్, 1 : జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ ని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ హాలు వద్ద బుధవారం విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, చేతి కర్రలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందించిన 15 వీల్ చైర్స్ ను ఏలూరు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏలూరు అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ కు అందించడం జరిగిందని, ఈ వీల్ చైర్ లను అవసరమైన వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభవంతులకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎం బి ఎస్ వి ప్రసాద్, వైస్ చైర్మన్ జె. సత్యనారాయణ రాజు, ట్రెజరర్ ఎన్.బ్రహ్మానందం, కార్యదర్శి బి. బెన్నీ, కమిటీ సభ్యులు ఏ.నాగేశ్వరరావు, ఎం చంద్రశేఖర్, ఎం వివిఎస్ నాగేశ్వరరావు, ఎం.అజయ్ బాబు, కోఆర్డినేటర్ వి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.