జిల్లాలో నెలరోజుల పాటు “APIIC పరిశ్రమ భాగస్వామ్య డ్రైవ్” ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు, అక్టోబర్, 15 : జిల్లాలో నెలరోజుల పాటు “APIIC పరిశ్రమ భాగస్వామ్య డ్రైవ్” ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం “APIIC పరిశ్రమ భాగస్వామ్య డ్రైవ్” పై ముద్రించిన వాల్ పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగా ఈ నెల 15 నుండి నవంబర్,15వ తేదీ వరకు నెలరోజుల పాటు “APIIC పరిశ్రమ భాగస్వామ్య డ్రైవ్” అమలు చేస్తూ 4 వారాలపాటు పారిశ్రామిక ప్రాంతాలలో పారిశ్రామిక పార్కులను స్థిరత్వం, భద్రత మరియు పెట్టుబడిదారుల సంసిద్ధత యొక్క ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయడం, పౌర మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, పచ్చదనం, నీరు & ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్, ప్రభృతులు పాల్గొన్నారు.