Close

జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పర్యటన సమయంలో ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞపులను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 02/12/2025

ఏలూరు, డిసెంబర్, 2 : జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పర్యటన సమయంలో ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞపులను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి మంగళవారం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పర్యటన సమయంలో ప్రజల నుండి అందిన వినతుల పరిష్కారంపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పలుమార్లు విచ్చేసిన సమయంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతుల రూపంలో తమ సమస్యలను తెలియజేసారని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందన్నారు. వాటిని పరిశీలించి ప్రజల వ్యక్తిగత సమస్యలపై నిబంధనలు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిని ప్రాధాన్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాలలో ప్రాంతాలు, సామజిక, మౌలిక సదుపాయాల కల్పన , తదితర సమస్యలను పరిష్కరించాలి కోరుతూ అందిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం శాఖల వారీగా అందుకు అయ్యే వ్యయం, తదితర అంశాలపై ప్రతిపాదనలను వెంటనే రూపొందించి సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా సీఈఓ శ్రీహరి, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి., వైద్య ఆరోగ్య, విద్యా శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.