Close

జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలియజేసారు.

Publish Date : 04/12/2025

ఏలూరు, డిసెంబర్, 4 : జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్య ఆరోగ్య సేవలు, ధాన్యం సేకరణ, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ వెట్రిసెల్వి సీఎస్ కి వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ సేవలలోనూ ప్రజల సంతృప్తిస్తాయిని పెంచేలా అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్య ప్రజలకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చూస్తున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ సేవలలోనూ ప్రజల సంతృప్తిస్తాయని పెంచేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డిఎంహెచ్ఓ డా. పి . జె. అమృతం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.