జిల్లాలో సెప్టెంబర్, 1వ తేదీ నుండి 21వ పశుగణన ప్రారంభం:- జేసీ పి . ధాత్రిరెడ్డి.

ఏలూరు, ఆగష్టు, 5 : ఏలూరు జిల్లాలో సెప్టెంబర్, 1 వ తేదీ నుండి డిసెంబర్, 21 వతేదీ వరకు పశుగణన నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ పి . ధాత్రిరెడ్డి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం పశుగణన గోడపత్రికను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ పశుగణన ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందన్నారు.
పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. జి. నెహ్రు బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గేదెలు, ఆవులు, గొర్రెలు,మేకలు, కుక్కలు వంటి జీవాలను లెక్కించడం జరుగుతుందన్నారు. వాటి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో పొందుపరచడం జరుగుతుందని, 417 మంది ఎన్యూమరేటర్లు, 67 మంది సూపెర్వైజర్లు పశుగణన చేస్తారన్నారు. వీరికి ఈనెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు డా. టి. గోవిందరాజులు, డా. సుబ్రహ్మణ్యం, డా. బి. ఎన్ .వి., లక్ష్మీనారాయణ, డా. హర్ష, డా. జాహ్నవి, ప్రభృతులు పాల్గొన్నారు.