జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని , జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
ఏలూరు,అక్టోబరు 13: ఏలూరు జిల్లా జాయింటు కలెక్టరుగా యం.జె. అభిషేక్ గౌడ సోమవారం పదవీభాద్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని
మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖ మరింత పట్టిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు . జిల్లాలో రైతుసేవా కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రతీ రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా , ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో వారం రోజులు పాటు జరిగే హేలాపురి ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు. అంతకుముందు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ ని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్ లు పూలమొక్కలు అందించి, ఘన స్వాగతం పలికారు.