Close

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.. పిజీఆర్ఎస్ లో 248 అర్జీలు అందాయి

Publish Date : 06/10/2025

ఏలూరు,అక్టోబరు,6: పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవచూపాలని జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్విఅధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, సర్వే ఏడి అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. పీజేఆర్ ఎస్ లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని..
పెదపాడు మండలం చిన్న సత్యవోలు గ్రామానికి చెందిన సింగవరపు వెంకట అప్పారావు తన భూమి గ్రామ సర్వేఆర్.ఎస్. నెం.453 ప్రక్కన ఉన్న భూమిని కొందరు చేపల చెరువు త్రవ్వివున్నారని దీని వలన చుట్టుప్రక్కల ఉన్న తమ అపరాల పంటలకు నష్టంవాటిల్లు తుందని కనుక అధికారులు పరిశీలించి తమకు నష్టపరిహారం అందించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఏలూరు పట్టణానికి చెందిన దొండపాటి విశాల్ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజి లో బిటెక్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయి బిటెక్ మొదటి సంవత్సరం పూర్తిచేశానని, తనకు అనారోగ్యం, కుటుంబ పరిస్ధితుల దృష్ట్యా ప్రస్తుతం నేను గోపన్నపాలెం పిఇటి కాలేజి నందు జాయిన్ అయినానని, గతంలో నేను చదివిన బిటెక్ ఇంజనీరింగ్ కాలేజిలో మొదటి సంవత్సరం పూర్తిచేసిన బిటెక్ సర్టిఫికేట్ ఇవ్వమని అడిగితే కాలేజి వారు రూ.75,000/- లు కడితేనే ఇస్తామని చెబుతున్నారని, కావున తమరు నాకు బిటెక్ చదివిన మొదటి సంవత్సరం సర్టిఫికేట్ ఇప్పించమని అర్జీ అందజేశారు. ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామానికి చెందిన గాజాల గోవర్ధన తనకు ఆధారమైన 0.05 సెంట్లు భూమిలో ఇల్లు నిర్మించుకొని దానిలో నివాసం ఉంటున్నానని, నిమ్మగడ్డ విజయక్రాంతి అనుఆమె మా ఇంటి నుంచి వెళ్లగొట్టారని, కావున అధికారులు వచ్చి సర్వేచేసి తన ఇల్లును తనకు ఇప్పించమని అర్జి అందజేశారు. పోలవరం మండలం పాతపేటకు చెందిన కత్తవ వెంకటలక్ష్మి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. చాట్రాయి మండలం చీపురుగూడెంకు చెందిన ఘంటసాల వెంకటేశ్వరరావు తనకు పించన్ మంజూరు చేయుమని కోరుతూ అర్జీ అందజేశారు. టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడెం కు చెందిన చక్రపు సాయమ్మ నా కుమారునికి తన ఇల్లు, స్ధలం వ్రాసి ఇచ్చానని అప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన ఇల్లును, స్ధలంను తిరిగి తనకు ఇప్పించమని అర్జీ అందజేశారు. సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో 200సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో 248 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు అందాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేటు సిబ్బంది పాల్గొన్నారు.