Close

జిల్లా రైతు సేవాకేంద్రాల్లో రైతులకు అందుబాటులో 30 వేలు టార్పాయిన్లు అందుబాటులో ఉంచాము రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ .

Publish Date : 27/10/2025

ఏలూరు,అక్టోబరు 27: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఏలూరు జిల్లా తుఫాన్ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.శివ ప్రతాప్ శివ కిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కలసి జిల్లా అధికారులతో ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ, నష్టం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. తుఫాన్ ప్రమాదం ముగిసే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తుఫాన్ సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. సహాయక కేంద్రాలలో భోజన, వసతి సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని, పరిసరాలు పరిశుభ్రత శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. తుఫాను బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చెయ్యాలని, ప్రభావిత ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులు నిల్వలు తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. తుఫాన్ సహాయక కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో టర్పాయిన్లు సిద్ధం చేశామని కావాల్సిన రైతులకు అందజేయాలని అన్నారు. సమాచార వ్యవస్థ సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, సెల్ టవర్స్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్లుకు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా డీజిల్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, సమాచార వ్యవస్థ బాగుండేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలువలు, ఆనకట్టలు, డ్రైనేజీ ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని అన్నారు.హోర్డింగ్లు లేకుండా చూడాలని, ఉన్నవి తొలగించాలని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనాలని మంత్రి చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.