Close

జ్ఞానభూమి పోర్టల్.. నందు ఈనెల 21 తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు.జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.

Publish Date : 15/10/2024

ఏలూరు/కె.ఆర్.పురం,అక్టోబర్ 15: ఐటిడిఏ కె.ఆర్. పురం పరిధిలోగల ఏజెన్సీ మండలాల్లోని మెగా డిఎస్సీకి సన్నధ్దమవుతున్న గిరిజన యువతీ, యువకులకు సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. బి.ఇడి/డిఇడి మరియు టెట్ పాసై కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉన్న ఆసక్తికలిగిన గిరిజన అభ్యర్ధులు ఈ నెల 21వ తేదీ లోపు జ్ఞానభూమి పోర్టల్ లో https://jnanabhumi.ap.gov.in లేదా https://mdfc.apcfss.in నందు నమోదు చేసుకోవాలన్నారు. సదరు ధరఖాస్తులను 6 దశల పరిశీలన అనంతరం అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. కావున ఆసక్తి కలిగిన గిరిజన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.