డాక్టరు ఎన్టీఆర్ వైద్య నగదు రహిత సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
ఏలూరు, నవంబరు 20: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం “యన్టీఆర్ వైద్య సేవలు- జిల్లా క్రమశిక్షణా కమిటీ” సమావేశాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికార్లు, ప్రభుత్వ, ప్రవేటు వైద్యులుతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రవేటు హాస్పిటల్స్ పై వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్షించారు. ఐవిఆర్ యస్ కాల్స్ ద్వారా 96, గుర్తించబడిన కేసులు 22, ఇందుకు సంబంధించిన 18, హాస్పిటల్స్ వారీగా వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ డాక్టరు ఎన్టీఆర్ వైద్యసేవను సక్రమంగా అమలు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారు ఆపద, అత్యవసర సమయంలో వైద్యం పొందేందుకు డాక్టరు ఎన్టీఆర్ వైద్యసేవ ఆశ్రయిస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టరు ఎన్టీఆర్ వైద్యసేవలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మన ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించటలో ముందు ఉన్నామని అయితే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టరు ఎన్టీఆర్ వైద్యసేవలపై ఎక్కడ ఒక చిన్న పిర్యాదు రాకుండా ఉన్నతమైన సేవలందించాలని అన్నారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి రెండు ప్రైవేటు హాస్పిటల్ పై మొదటి తప్పుగా భావించి పెనాల్టీ విధించడం జరిగిందని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావతం కాకుండా చూడాలని ఆదేశించామని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రతి హాస్పటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నగదు రహిత సేవలు అందరికీ అర్థమయ్యే రీతిలో ప్లెక్సీ బోర్డులు పెట్టాలని, వచ్చిన పేషెంటుకు స్నేహభావంతో అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించాలని అన్నారు. హాస్పిటల్ కి వచ్చిన పేషెంటును చిరునవ్వుతో పలకరిస్తే సగం రోగం తగ్గుతుందని, వైద్యాన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో చూడాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఓపి కేసులు నమోదు చేసుకున్న వారికి నగదు రహిత సేవలు అందించబడతాయని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత మందులు మరియు రవాణా ఛార్జీలు అందించాలని అన్నారు. వైద్య సేవలు, చికిత్సలు నిరాకరణ, డబ్బులు వసూలు, తదితర సమస్యలు ఉన్నాయా అని పేషెంట్లను విచారించడం జరుగుతుందని అన్నారు. వారి నుండి సంతృప్తిగా సమాధానం ఉంటే అభినందిస్తామని, లోటుపాట్లు ఉన్నాయని చెబితే విచారణ చేసి ఆయా హాస్పిటల్ పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పథకం కింద చేరిన రోగులు పట్ల వైద్యసేవలో నిర్లక్ష్యం వహించవద్దని, డబ్బులు వసూలు చేయకూడదని, రోగులు ప్రాథమిక అవసరాలు మంచి ఆహారం మరియు మంచి పారిశుధ్యం తప్పక ఉండేలా చూడాలన్నారు. హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తక్షణ చర్యలు తప్పవని అన్నారు. అన్ని నెట్వర్క్ హాస్పటల్లో వైద్య నిపుణులు, వైద్యులు మరియు సిబ్బంది పేర్లు, ఫోను నెంబర్లుతో సహా వివరాలను ప్రదర్శించాలని, ఏమైనా మార్పులు జరిగినా సకాలంలో తెలియ జెయ్యాలని ఆదేశించారు. అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో సిసి కెమెరాలను నిర్వహించాలని, ఏదైనా అంతరాయం ఏర్పడితే సకాలంలో సరిచెయ్యాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ యస్ డా.బి. పాల్ సతీష్ కుమార్, ఎన్టీఆర్ వైద్యశ్రీ కో.ఆర్డినేటరు డా.ఐ.రాజీవ్, ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంటు డా.యం.యస్.రాజు, ప్రభుత్వ, ప్రవేటు హాస్పిటల్స్ వైద్యాధికారులు, ప్రతినిధులు, ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు రాజ, భారతి, శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.