దత్తత తీసుకున్న పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు.

ఏలూరు,జనవరి,29:
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శిశు గృహం అనుసంధానంగా ఉన్న బాలసదనంలోని నూకాలమ్మ అలియాస్ మహతి సౌమ్య (12సం)ల పాపను తమిళనాడు రాష్ట్రానికి చెందిన సేలం జిల్లా వాస్తవ్యులైన జనార్ధనన్ కె , సీతాలక్ష్మి ఎం దంపతులకు కారా నియమ నిబంధనల ప్రకారం
కేరింగ్స్ పోర్టల్ ద్వారా గత మాసంలో 5వ తారీఖున ప్రీ అడాప్షన్ పోస్టర్ కేర్ తీసుకోవడం జరిగింది. వారు పాపతో అనుబంధాన్ని పెంచుకున్న తర్వాత వారు పాప పట్ల అవలంబిస్తున్న పెంపక విధానాలను గమనించి వారికి తుది దత్తత ఉత్తర్వులను గౌరవ కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి వారు బుధవారం స్థానిక కలెక్టర్ వారి ఛాంబర్ నందు పాప యొక్క యోగక్షేమాలను ఆరా తీసి పాపతో వారి అనుబంధము బాగుందని సంతృప్తి చెందిన తర్వాత తుది దత్తత ఉత్తర్వులను వారే సొంత తల్లిదండ్రులు అని నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విధంగా పెద్దపాపలను అనగా ఐదారు సంవత్సరములు పైబడిన బాలలను దత్తత తీసుకోవడం అనేది శుభపరిణామమని వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు లేరు అనే భావనతో బాధపడుతూ వివిధ రకాల హోమ్ ల లోనే జీవితం కొనసాగిస్తున్న బాలలకు ఈ విధంగా పెద్ద పిల్లల నైనా మేము దత్తత తీసుకుని ఒక కుటుంబమును ఏర్పాటు చేయగలమని ముందుకు రావలసిందిగా పిల్లలు లేని తల్లిదండ్రులు పెద్ద పిల్లలను దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ విధంగా దత్తత తీసుకున్న పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు.