దివ్యాంగులు పారా స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని మన జిల్లా సత్తా చాటాలి 7వ రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ,మతి వెట్రీసెల్వి
ఏలూరు, సెప్టెంబర్, 29 : జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్-2025 పోటీలకు ఏలూరులో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర స్థాయి పారాస్విమ్మింగ్ క్రీడా పోటీలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం రాష్ట్ర స్థాయి పారాస్విమ్మింగ్ క్రీడా పోటీల గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నవంబర్, 15 నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్ లో జరగబోయే “25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్ 2025” ఎంపికలో భాగంగా ఏలూరులో జిల్లా బిశ్వనాథ్ భర్తీయ స్విమ్మింగ్ పూల్ , జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నందు అక్టోబర్,12వ తేదీన ప్రారంభం కానున్న 7 వ రాష్ట్ర స్థాయి పారాస్విమ్మింగ్ క్రీడా పోటీలు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీలు ఏలూరులో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అన్ని జిల్లాల నుండి పారా క్రీడాకారులు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరచి నవంబర్ లో జరగబోయే 25వ జాతీయ స్థాయి పారా స్విమ్మింగ్ ఛాంపియన్-షిప్ 2025 కు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ యడ్లపల్లి సూర్యనారాయణ, పారా స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్, అంతర్జాతీయ దివ్యాంగుల క్రికెట్ అంపైర్ నాగేంద్ర సింగ్, దివ్యాంగ స్విమ్మింగ్ క్రీడాకారులు బత్తిన నాగేశ్వరావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.