ద్వారకాతిరుమల/ ఏలూరు, నవంబర్, 11 : రాష్ట్రాన్ని వ్యవసాయరంగంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి దిశలో పయనింపజేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ద్వారకాతిరుమల/ ఏలూరు, నవంబర్, 11 : రాష్ట్రాన్ని వ్యవసాయరంగంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి దిశలో పయనింపజేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 60 పారిశ్రామిక ప్రాజెక్టులు మరియు 51 ఎంఎస్‌ఎంఈ లు ప్రారంభోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్. పోతేపల్లి లో 208 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ను పనులను మంగళవారం ముఖ్యమంత్రి వర్చ్యువల్ గా శంఖుస్థాపన చేయగా, ద్వారకా తిరుమల మండలం సిహెచ్. పోతేపల్లి లో గోద్రేజ్ ఆగ్రోవెట్ పరిశ్రమకు మంగళవారం రాష్ట్ర జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపథంలో నిలిపేందుకు మన రాష్ట్రంలో పెట్టుబడిదారులు పరిశ్రమలు ఏర్పాటుచేసేలా ప్రోత్సహించేందుకు ఈనెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక పారిశ్రామిక సదస్సును ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారన్నారు. దీనివల్ల మన రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉందని, వాటితో పాటు మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రైతులు తాము పండించే పంటలకు మరింత మెరుగైన ధర లభించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయడం మంచి మార్గమన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, ఆయిల్ పామ్ సాగులో రైతులను ప్రోత్సహించి, మరింత విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పండించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మలేషియా వంటి రాష్ట్రాలలో పండే ఆయిల్ పామ్ వంటి నాణ్యమైన ఆయిల్ పామ్ మన ఏలూరు జిల్లాలో పండడం మనకు గర్వకారణమని, ఆయిల్ పామ్ సాగులో ఎకరాకు లక్ష నుండి రూ. 1. 25 లక్షల వరకు ఆదాయం వస్తుందని, డ్రిప్ ఇరిగేషన్ విధానం ఏర్పాటుచేసుకునేందుకు రైతులకు సబ్సిడీ పై ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కొత్త సాంకేతిక ఆయిల్ పామ్ మొదటి మూడు సంవత్సరాలలోనే పంట దిగుబడి చేతికి వస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. జిల్లా వృద్ధి రేటు 15 శాతం సాధనలో ఉద్యానవన పంటలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని, 45 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ పంట సాగవుతుందని, దీనిని 60 వేల హెక్టార్లకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ సిహెచ్. పోతేపల్లిలో 208 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 366 మందికి, పరోక్షంగా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) కార్యదర్శి చిరంజీవి చౌదరి, ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆర్టిసి రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ప్రభృతులు పాల్గొన్నారు.