Close

నీట్-2025 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్,.

Publish Date : 04/05/2025

ఏలూరు,మే,3: ఈనెల 4వ తేదీ ఆదివారం నీట్ (NEET) పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం నీట్ పరీక్షా కేంద్రమైన ఏలూరు లోని కస్తూరిభా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ లోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థుల ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పరిశీలనచేసి సంబంధిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈనెల 4వ తేదీ నిర్వహించే నీట్ పరీక్షకు 1200 మంది విద్యార్ధులు హజరవుతున్న నేపద్యంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్ష మే 4వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. ఉదయం 11.00 గంటల నుంచి విద్యార్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు (సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు) వాడకం పూర్తిగా నిషిద్ధమన్నారు. దివ్యాంగ విద్యార్ధులకు పరీక్షా కేంద్రంలో వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రం పరిధిలో సెక్షన్-163బి సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అనవసర వస్తువులు తీసుకురావద్దని సూచించారు. అడ్మిట్ కార్డు తప్ప ఇతర ఎలాంటి వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు.

వీరి వెంట తహశీల్దార్లు వి. శేషగిరి, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

పరీక్షా కేంద్రాల వివరాలు..

ప్రభుత్వం జూనియర్ కళాశాల, కోటదిబ్బ, సబ్‌జైల్ ఎదురుగా, ఏలూరు-1 (సీటింగ్ -240)
కస్తూరిభా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ, ఏలూరు-1 (సీటింగ్-360)
సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్, ఆర్.ఆర్.పేట, ఏలూరు-2 (సీటింగ్-240)
కేంద్రీయ విద్యాలయ, గోపన్నపాలెం, దెందులూరు మండలం (సీటింగ్ – 240)
ప్రభుత్వం ఉన్నత పాఠశాల, గోపన్న పాలెం, దెందులూరు మండలం, (సీటింగ్-120)