Close

నూజివీడు నియోజకవర్గంలో ఈనెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వివిధ కార్యక్రమాలలో పాల్గొనవచ్చునని, ఈ దృష్ట్యా వివిధ శాఖల అధికారులందరూ తమ శాఖలకు సంబందించి అన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 07/04/2025

ఏలూరు/నూజివీడు, ఏప్రిల్, 7 : నూజివీడు నియోజకవర్గంలో ఈనెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వివిధ కార్యక్రమాలలో పాల్గొనవచ్చునని, ఈ దృష్ట్యా వివిధ శాఖల అధికారులందరూ తమ శాఖలకు సంబందించి అన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నూజివీడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రివర్యుల పర్యటన ఏర్పాట్లపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈనెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో పాటు , పీ4 కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలను కలిసి వారి సమస్యలు తెలుసుకునే కార్యక్రమం, అనంతరం ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. . గ్రామంలోని అత్యంత నిరుపేదల వివరాలు, వాటి సామజిక, ఆర్ధిక పరిస్థితి, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలు, తదితర అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలను ముఖ్యమంత్రివర్యులు అడిగే అవకాశం ఉందని, కావున సంబంధిత శాఖల అధికారులందరూ తమతమ శాఖలకు సంబందించిన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బిసి లోన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు లబ్ధిదారులను, రుణాల మంజూరు చెక్కులను సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రివర్యులు విచ్చేసే గ్రామం, మండలంలకు సంబంధించి స్వర్ణాంధ్ర-2047 కార్యాచరణ ప్రణాళికలను, స్థానిక సమస్యల వివరాలు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాలని చర్యలు, తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామంలో నిరుపేదలు, కులవృత్తుల వారి వివరాలు, వారి జీవన స్థితిగతుల సమాచారం సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర విజన్ -2047 కు సంబంధించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. స్థానికంగా రైతులు, మామిడి , తదితర ఉద్యానవన పంటలకు సంబంధించి వివరాలు, వాటి సాగు అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, డిపిఓ కె. అనురాధ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.