పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలా, మధుర స్మృతిలా నిలిచిపోయేలా నిర్వహించాలి విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపు
ఏలూరు, డిసెంబర్, 6 : జిల్లాలో ఈనెల 7వ తేదీన జరగనున్న ‘మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో’ లో విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం ‘మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో’ ఏర్పాట్లను పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవలసిన అవసరమైన చర్యలను విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోడానికి ‘మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం’ సరైన వేదికన్నారు. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యా అందించేందుకు విద్యా ప్రమాణాల స్థాయి పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయని, వాటిల్లో ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడయన్నారు. ఏలూరు జిల్లాలో 1788 ప్రాధమిక, ఉన్నత, రెసిడెన్షియల్, గిరిజన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటన్నింటిలోనూ ఈనెల 7వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ముందుగా విద్యార్థుల తల్లితండ్రులను, పూర్వ విద్యార్థులను, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులను, తదితరులను సమావేశానికి స్వగతం పలుకుతారన్నారు. అనంతరం విద్యార్థుల సమగ్ర ప్రగతిపై తల్లితండ్రులతో చర్చించడం, విద్యా ప్రగతికి తీసుకోవలసిన చర్యలపై ఉపాధ్యాయులతో చర్చిండం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలపై చర్చిస్తారన్నారు. , సైబర్ నేరాలపై అవగాహన, పూర్వ విద్యార్థుల విజయగాధలు, అతిధుల ప్రసంగాలు,ఆహ్వానితులచే అభిప్రాయసేకరణ ఉంటాయన్నారు. అనంతరం అందరూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంలో సహపంక్తి భోజనం చేస్తారన్నారు. ‘మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం’ నకు సంబంధించి విద్యార్థులే స్వయంగా ఆహ్వాన పత్రికలూ తయారు చేసి తల్లితండ్రులకు అందజేస్తున్నారన్నారు. ‘మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం’ ఒక పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలా నిర్వహించి, పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ మధుర స్మృతిలా నిలిచేలా విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకున్నారని, ఆహ్వాన పత్రాలను విద్యార్థుల తల్లితండ్రులకు, పాఠశాల నిర్వహణ కమిట సభ్యులు, తదితరులందరకీ పంపించామన్నారు. సమావేశానికి సంబందించిన ప్రతీ ఒక్కరూ హాజరు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పాఠశాలలను గుర్తించి, ఆ పాఠశాలల్లోని అందరూ వియోద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, వారికి హెల్త్ కార్డులు అందించడం జరుగుతుందన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో సమగ్ర విద్యా ప్రగతి పత్రాలు (holistick card) పంపిణీ చేస్తారన్నారు. విద్యార్థులకు సంపూర్ణ విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు తగిన చర్యలు చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధికి తల్లితండ్రుల సలహాలు స్వీకరిస్థారన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహణలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన బ్యాక్ డ్రాప్ లు మాత్రమే వినియోగించాలన్నారు.
జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, ప్రభృతులు పాల్గొన్నారు.