Close

పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 25/09/2024

ఏలూరు, సెప్టెంబర్, 25: పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో జిల్లాలో 110 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. సింగల్ విండో ద్వారా అందిన ధరఖాస్తులలో చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను తిప్పివేయకుండా దరఖాస్తుదారులు పిలిచి వాటిని సరిదిద్దాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంది పరిష్కారానికి వీలులేని దరఖాస్తులను అందుకు గల కారణాలు తెలియజేస్తూ తిప్పివేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో తక్కువ పెట్టుబడితో అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సహిస్తూ, పారిశ్రామికాభివృద్ధికి అధికారులు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పరిశ్రమలలో భద్రతా చర్యలపై అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పిఎంఈజిపి కార్యక్రమం కింద బ్యాంకులను అందిన 151 ధరఖాస్తులలో 102 దరఖాస్తులు బ్యాంకర్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయని , వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసిన 20 యూనిట్లకు 1. 14 కోట్ల రూపాయలు విద్యుత్, వడ్డీ, అమ్మకం పన్ను, పెట్టుబడి రాయితీలుగా అందించేందుకు సమావేశం తీర్మానించింది.
సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, మత్స్య శాఖ జేడీ నాగలింగాచారి, ఉద్యానవనాలు శాఖ డిడి మోహనరావు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ఎల్డిఎం నీలాద్రి, నాబార్డ్ డిడిఎం అనిల్ కాంత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకటేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.