పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లో అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు, ఫిబ్రవరి 23: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లా స్థాయీ అధికారులతో నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, కెఆర్ సీసీ డిప్యూటీ కలెక్టరు యల్. దేవకిదేవి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ లు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు నుండి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలు నుండి స్వీకరించిన అర్జీలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగానే నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే ఆయా శాఖలు అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలోకి అధికారులు వెళ్ళి లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని.
భీమడోలు మండలం భోగాపురం నివాసి రేవులగడ్డ పౌలురాజు మాకు విద్యుత్తు స్తంభాలు వేశారు కాని విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదని కరెంటు లేక పిల్లలతో చాలా ఇబ్బందులు పడుచున్నామని మాకు కరెంటు వచ్చేలా చూడగలరని కోరారు, ఏలూరు మండలం సత్రంపాడు నివాసి బట్టు ప్రేమవాణి నా భర్త గృహ హింస పెట్టుచున్నారు నాకు న్యాయం చెయ్యాలని కోరారు, వేలేరుపాడు మండలం రేపాకగుమ్ము నివాసి నల్లం శ్రీనివాస్ నా ఇల్లు ముంపుకు గురైంది నష్టపరిహారం మంజూరు అయింది కాని డబ్బులు జమకాలేదని డబ్బులు ఇప్పించాలని కోరారు, పెదవేగి మండలం వీరన్నపాలెం గ్రామ నివాసి వాయిల దుర్గమ్మ మా వీధిలో అయిదు మందికి ఇండ్లు మంజూరు అయ్యాయని స్లాబులు వరకు నిర్మించుకున్నామని మిగతా డబ్బులు మంజూరు చేస్తే గృహానిర్మాణాలు పూర్తి చేసుకుంటామని కోరారు, ఏలూరు అర్బన్ చేపలతూము సెంటరు బోట్ల సూరిబాబు ఇంటి స్థలం మంజూరు చేశారు సంతోషం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఋణం కూడా మంజూరు చెయ్యాలని కోరారు, రెవిన్యూ క్లినిక్ లు మండలాలు వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి స్వీకరించారు. వీటిలో భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వేలో తేడాలు, రీ సర్వే తిరిగి చెయ్యాలని, తదితర ఇతర భూసమస్యలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి. నాంచారయ్య, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.